జగన్, పవన్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందంటూ పార్టీని వీడిన వెలగపూడి
- ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండలేనన్న వెలగపూడి
- పార్టీకి స్థలం ఇచ్చిన తొలి వ్యక్తిని తానేనన్న నేత
- కన్నాకు రాజీనామా లేఖ
గత ఎన్నికలకు ముందే తాను బీజేపీలో చేరానని పేర్కొన్న వెలగపూడి.. విజయవాడ సమీపంలోని నిడమానూరులో పార్టీకి వెయ్యి గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ కీలక కమిటీల్లో తనను చేరుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని కన్నాను నిలదీశారు . తాను విరాళంగా ఇచ్చిన స్థలంపై తుది నిర్ణయం పార్టీదేనని, బీజేపీ ఖాతా వివరాలను పంపితే రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన రూ. 50 వేలను తిరిగి పంపిస్తానని వెలగపూడి స్పష్టం చేశారు.