నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన రేణుకా చౌదరి
- కారు పార్టీ ఒక బేకారు పార్టీ
- అవకాశవాదంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు
- మోదీతో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉంది
అవకాశవాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల వరకు కూడా మహాకూటమి కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరపున ఈరోజు ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.