కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన శర్వానంద్
- సుధీర్ వర్మతో శర్వానంద్
- యూవీ బ్యానర్లో మరో మూవీ
- గతంలో హిట్స్ ఇచ్చిన బ్యానర్
ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దర్శకత్వ శాఖలో పనిచేస్తూ వచ్చిన ఒక కుర్రాడు, శర్వానంద్ కి ఒక లైన్ చెప్పాడట. ఆయనకి బాగా నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించడానికి యూవీ క్రియేషన్స్ వారు ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ బ్యానర్లో శర్వానంద్ సినిమాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. సుధీర్ వర్మ సినిమా తరువాత శర్వానంద్ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు.