ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్
- సంతోష్ దర్శకుడిగా 'సుబ్రహ్మణ్యపురం'
- ఆలయం చుట్టూ తిరిగే కథ
- నాస్తికుడైన యువకుడిగా సుమంత్
సుబ్రమణ్యపురంలోని ఆలయం .. అక్కడ చోటుచేసుకునే సంఘటనలపై రీసెర్చ్ చేయడానికి వచ్చిన నాస్తికుడైన యువకుడిగా సుమంత్ కనిపిస్తున్నాడు. ఆ గ్రామంలో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనలు .. గ్రామ పెద్దల హెచ్చరికలు .. ఊరి వదిలి వెళ్లేది లేదనే హీరో మొండితనానికి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ కొనసాగింది. 'గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని మేం నమ్ముతాం.. నువ్వేమో ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావ్' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.