షూటింగులో గాయపడ్డ హీరో రాజశేఖర్!
- రాజశేఖర్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న 'కల్కి'
- డూప్ లేకుండా నటించిన రాజశేఖర్
- భుజానికి గాయంతో ఆసుపత్రికి
సినిమా యూనిట్ వారిస్తున్నా వినకుండా రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేయాలని రాజశేఖర్ నిర్ణయించారని ఈ క్రమంలో ఆయన భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. గాయాన్ని లెక్క చేయని రాజశేఖర్ షూటింగ్ ను పూర్తి చేసి, ఆపై ఆసుపత్రికి వెళ్లారట. కాగా, ఈ చిత్రంలో ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్ లెట్ విల్సన్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.