కూకట్ పల్లిలో నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని!
- వెంటవచ్చిన బాలయ్య, పెద్దిరెడ్డి
- భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
- కార్యకర్తలతో భేటీ కానున్న సుహాసిని
నామినేషన్ దాఖలు అనంతరం సుహాసిని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం బాలయ్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నందమూరి సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. తాను గెలిస్తే కూకట్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు.