మల్లికార్జున్ కి పాదరక్షలు అందించి.. దీక్ష విరమింపజేసిన కేసీఆర్!
- తెలంగాణ వచ్చేంత వరకు చెప్పులు ధరించనంటూ దీక్ష
- 2005 నుంచి పాదరక్షలు లేకుండానే ఉన్న మల్లికార్జున్
- విషయం తెలుసుకుని చలించిపోయిన కేసీఆర్
ఈ నేపథ్యంలో, మల్లికార్జున్ దీక్ష గురించి ఈనెల 14న కేసీఆర్ దృష్టికి ఎంపీ సీతారాంనాయక్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని పట్టుదలకు కదలిపోయారు. గురువారం (15వ తేదీ) ఆయనకు సీఎం కార్యాలయ అధికారుల నుంచి పిలుపు వచ్చింది. దీంతో, సీతారాంనాయక్ తో కలసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ను అభినందించిన కేసీఆర్... ఆయనకు పాదరక్షలు ఇచ్చి, దీక్షను విరమింపజేశారు. దీంతో, ఎట్టకేలకు ఆయన దీక్ష ముగిసింది.