హెల్మెట్ పెట్టుకోనందుకు క్షమించండి.. ఓ వ్యక్తిని పొడిచేసి వస్తున్నా!: వాహనదారుడి సమాధానంతో షాకైన పోలీసులు
- సందీప్ నుంచి రూ.లక్ష తీసుకున్న దేవరాజ్
- నమ్మించి సందీప్‌ని మోసం చేశాడు
- దేవరాజ్‌ను కత్తితో పొడిచిన సందీప్
ఎంతకీ తన డబ్బు తిరిగివ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో దేవరాజ్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం సందీప్ లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా.. చిక్‌బళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేదేమిటని అడిగితే తను దేవరాజ్‌ను పొడిచి వస్తున్నానని.. లొంగిపోయేందుకు స్టేషన్‌కు వెళుతున్నానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. హెల్మెట్ పెట్టుకోనందుకు క్షమించాలని సందీప్ పోలీసులను వేడుకోవడం విశేషం. ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.