రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడితో అల్లరి నరేశ్
- వరుస పరాజయాలు
- సక్సెస్ కోసం ప్రయత్నాలు
- త్వరలో మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి
ఇక ఈ తరహా పాత్రలనే చేస్తాడేమోనని అనుకున్నవారు లేకపోలేదు. కానీ తాను హీరోగా కొనసాగాలనే పట్టుదలతోనే అల్లరి నరేశ్ వున్నాడు. త్వరలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సీమశాస్త్రి' .. 'సీమటపాకాయ్' సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తారట. ఈ సినిమాతోనైనా అల్లరి నరేశ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.