'మీటూ' అన్నందుకు ఒక్క అవకాశం కూడా రావడం లేదు: కేరళ బ్యూటీ రమ్య ఆవేదన!
- పలు భాషల చిత్రాల్లో నటించిన రమ్య నంబీశన్
- 'మీటూ'పై ఇటీవల ప్రశ్నించిన రమ్య
- అవకాశాలు లేకుండా చేశారని ఆరోపణ
అయితే, ఇప్పుడు ఆమెకు కొత్తగా ఒక్క అవకాశం కూడా రావడం లేదట. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరిట ఓ సంఘం ఏర్పాటు కాగా, దానిద్వారా ప్రశ్నించిన తనను పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చింది రమ్య. తానిప్పుడు కోలీవుడ్ ను నమ్ముకున్నానని అంటోంది. మహిళలకు రక్షణగా 'మీటూ' ఉప్పెనలా వచ్చిందని, అయితే, గొంతెత్తిన వారిని పరిశ్రమ దూరం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.