బాగుంది ప్రధాని గారూ.. మీ తీరు!: విరుచుకుపడిన నటుడు ప్రకాశ్ రాజ్
- ప్రధానిపై మళ్లీ గళమెత్తిన ప్రకాశ్ రాజ్
- వరదలతో అల్లాడిన కేరళకు రూ.600 కోట్లు
- పటేల్ విగ్రహానికి వేల కోట్లా?
అంతటి విపత్తు జరిగితే కేరళను ఆదుకోవాల్సిన ప్రధాని తొలుత వంద కోట్ల రూపాయల సాయం ప్రకటించారని, విమర్శలు రావడంతో ఆ తర్వాత మరో 500 కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ సర్దార్ పటేల్ విగ్రహానికి మాత్రం వేల కోట్ల రూపాయలను నీళ్లలా ధారపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీని దుమ్మెత్తి పోశారు. విగ్రహానికి ఇచ్చిన విలువ మనుషులకు లేకుండా పోయిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.