రవితేజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు
- రవితేజ సరసన ఇలియానా
- ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 16వ తేదీన సినిమా విడుదల
హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్లో రేపు సాయంత్రం 6:30 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది. ముఖ్య అతిథులు ఎవరనేది ఇంకా ఎనౌన్స్ చేయవలసి వుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాలో కథానాయికగా ఇలియానా అలరించనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీను వైట్ల, ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను అందిస్తుందనే నమ్మకంతో వున్నాడు.