మొత్తానికి అనుష్క ఒక సినిమాను ఒప్పేసుకుంది!
- అనుష్క ప్రధాన పాత్రగా మూవీ
- వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి
- అనుష్క జోడిగా కనిపించనున్న మాధవన్
నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రకారం ఎక్కువభాగం చిత్రీకరణ యూఎస్ లో జరగనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అక్కడ షూటింగు మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమాలో ఆమె జోడీగా మాధవన్ కనిపించనున్నారు. ఒక పుష్కరకాలం తరువాత అనుష్క .. మాధవన్ లు కలిసి నటిస్తుండటం విశేషం.