నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలొచ్చేవి: ఏఆర్ రెహ్మాన్
- తండ్రి మరణం భయాన్ని పోగొట్టింది
- ఎవరూ పనికిరారు అనుకోకూడదు
- అసలు పేరు దిలీప్ నచ్చేది కాదు
- ఇస్లాం మతంలోకి మారడంతో పేరు మారింది
తన తండ్రి మరణం తనలో భయాన్ని పోగొట్టిందన్నారు. ఆ సమయంలో 35 సినిమాలకు అవకాశమొస్తే రెండు సినిమాలకు మాత్రమే పనిచేశానని రెహ్మాన్ తెలిపారు. తన అసలు పేరు దిలీప్ అని, రోజా సినిమాకు సంగీతం అందించే సమయంలో తన కుటుంబం ఇస్లాం మతంలోకి మారడంతో తన పేరు రెహ్మాన్గా మారిందన్నారు. ఎందుకు ఇష్టంలేదో తెలియదు కానీ అసలు దిలీప్ అనే పేరు తనకు నచ్చేది కాదని తెలిపారు. సంగీతమే తనలో మార్పు తెచ్చిందని రెహ్మాన్ వెల్లడించారు.