దీపావళికి టీవీలో త్రిష కొత్త సినిమా... ఇదేంటని ప్రశ్నిస్తున్న త్రిష!
- విజయ్ సేతుపతి, త్రిష కలసి నటించిన '96'
- దీపావళికి ప్రసారం చేస్తున్నామన్న టీవీ చానల్
- ఇంకా సినిమా ఆడుతోందని గుర్తు చేసిన త్రిష
- సంక్రాంతికి వేసుకోవాలని వినతి
'96' సినిమా విడుదలై ఇది ఐదో వారమేనని గుర్తు చేసిన త్రిష, "ఇప్పటికీ 80 శాతం థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఇంత త్వరగా సినిమా ప్రీమియర్ షో వేయడం సబబు కాదు. సంక్రాంతికి ప్రీమియర్ షో వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం" అని పేర్కొంది.
ఇక ఇదే విషయంలో సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను కలిగివున్నంత మాత్రాన ఇలా చేస్తే, అది చిత్ర పరిశ్రమ మొత్తానికీ నష్టం కలిగిస్తుందని, సంక్రాంతికి చిత్రాన్ని వేసుకోవాలని ఆ చానల్ ను వేడుకుంటున్నామని అన్నారు.