వైఎస్ 'యాత్ర' బయోపిక్ అప్డేట్
- షూటింగు పూర్తి చేసుకున్న 'యాత్ర'
- తన పాత్రకి డబ్బింగ్ చెప్పిన మమ్ముట్టి
- డిసెంబర్ 21వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకుంటోంది. మమ్ముట్టి తెలుగులోను తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వుంటారు. అలాగే ఆయన ఈ సినిమాలో కూడా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. జగపతిబాబు .. సుహాసిని .. రావు రమేష్ .. అనసూయ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.