'సవ్యసాచి'పై క్రేజ్ .. ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్
- 'సవ్యసాచి'గా నాగచైతన్య
- దిల్ రాజుకి నైజామ్ ఏరియా హక్కులు
- నవంబర్ 2వ తేదీన భారీ రిలీజ్
ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని చెబుతున్నారు. నాగచైతన్య కెరియర్లోనే గతంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా 22.32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన నైజామ్ ఏరియా హక్కులను దిల్ రాజు 6 కోట్లకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.