అటు దిల్ రాజు .. ఇటు మహేశ్ .. మధ్యలో వంశీ పైడిపల్లి!
- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి'
- యాక్షన్ పాళ్లు పెంచమంటోన్న దిల్ రాజు
- అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్న మహేశ్
దాంతో మరో రెండు ఫైట్లు పెడదామనీ .. హిందీ డబ్బింగ్ రైట్స్ పెద్ద మొత్తానికి పోవాలంటే యాక్షన్ పాళ్లు ఎక్కువగా వుండాలని దిల్ రాజు వంశీ పైడిపల్లికి చెప్పారని వినికిడి. కథ ప్రకారమే ఫైట్లు ఉండాలి గానీ ... అనవసరంగా కొత్త ఫైట్లు జోడించవద్దనే అభిప్రాయాన్ని మహేశ్ వ్యక్తం చేశాడని చెబుతున్నారు. ఒక వైపున ఫైట్లు పెంచమని దిల్ రాజు .. మరో వైపున వద్దని మహేశ్ బాబు చెబుతుండటంతో, వంశీ పైడిపల్లి ఇరకాటంలో పడ్డాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఫైనల్ గా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.