'దేవ్' ఫస్టు లుక్ తో అదరగొట్టేస్తోన్న కార్తీ
- కార్తీ హీరోగా రూపొందుతోన్న 'దేవ్'
- సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్
- డిసెంబర్లో సినిమా విడుదల
రేసింగ్ బైక్ దగ్గర హెల్మెట్ పట్టుకుని .. యాక్షన్ లోకి దిగడానికి సిద్ధంగా వున్నట్టుగా తీక్షణమైన చూపులతో కార్తీ కనిపిస్తున్నాడు. నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, డిసెంబర్లో విడుదల చేయనున్నారు. గతంలో కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' ఘన విజయాన్ని అందుకుంది. అందువలన 'దేవ్' పై అందరిలోనూ ఆసక్తి వుంది. మరోసారి ఈ జంట హిట్ కొడుతుందేమో చూడాలి.