'అరవింద' హిట్ అయినా నిరాశకి లోనైన ఈషా రెబ్బా
- 'అరవింద'పై ఆశలు పెట్టుకున్న ఈషా రెబ్బ
- పాత్ర నిడివి తగ్గడం వలన రాని గుర్తింపు
- 'అరవింద' కోసం వదులుకున్న రెండు సినిమాలు
కానీ 'అరవింద సమేత' సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడం వలన, ఆమె ప్రభావం ప్రేక్షకులపై అంతగా లేకుండా పోయింది. దాంతో ఈషా రెబ్బాకి ఆశించిన స్థాయిలో ఈ సినిమా క్రేజ్ తీసుకురాలేకపోయింది. దాంతో అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ రావడం లేదు. 'అరవింద'కి ముందు ఈషాకి రెండు సినిమాలు వచ్చాయట. 'అరవింద'ను చూసుకుని ఆమె వాటిని వదిలేసిందట. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పోయినందుకు .. 'అరవింద' చేసినందు వలన పెద్దగా ప్రయోజనం లేనందుకు ఈషా నిరాశకి లోనైందని చెప్పుకుంటున్నారు.