మీటూ.. సీనియర్ నటుడు అర్జున్ పై ఆరోపణలు చేసిన శృతి
- రిహార్సల్స్ సమయంలో నన్ను హత్తుకున్నాడు
- సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడు
- ఒక నటి అనుమతి తీసుకోకుండా.. ఇలా చేయడం దారుణం
'విస్మయ' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని శృతి ఆరోపించింది. ఓ రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా... చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని ఆమె తెలిపింది. ఒక నటి అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని చెప్పింది. ఆ ఘటనతో షాక్ అయిన తాను, గట్టిగా విదిలించుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేశానని ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించింది. శృతి ఆరోపణలపై అర్జున్ ఇంకా స్పందించాల్సి ఉంది.