'ఎన్టీఆర్'లో హరికృష్ణగా కల్యాణ్ రామ్ లుక్!
- ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణగా కల్యాణ్ రామ్
- దసరా సందర్భంగా పోస్టర్ విడుదల
- జనవరి 9న విడుదల కానున్న చిత్రం
ఎన్టీఆర్ రూపంలోని బాలకృష్ణ ఠీవీగా కూర్చుని వుండగా, ఆయన పక్కనే హరికృష్ణగా, కల్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. "విజయం మీది. విజయరథ సారధ్యం నాది. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ" అంటూ ఓ డైలాగ్ ను కూడా పెట్టారు. కాగా, ఈ చిత్రం తొలి భాగం కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే.