సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- త్రిషపై ప్రశంసలు కురిపించిన సమంత
- 'సైరా' పూర్తి చేసి వస్తున్న చిరంజీవి
- నిఖిల్ సరసన నివేదా థామస్
* చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ గత కొంత కాలంగా జార్జియాలో జరుగుతోంది. భారీ యాక్షన్ దృశ్యాల చిత్రీకరణలో పాల్గొన్న చిరంజీవి తన షూటింగును పూర్తిచేసుకుని తిరుగుపయనమయ్యారు. మిగతా ఆర్టిస్టులతో ఈ నెల 20 వరకు అక్కడ షూటింగ్ కొనసాగుతుంది.
* ప్రస్తుతం 'ముద్ర' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో నిఖిల్, తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. నూతన దర్శకుడు కిషన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నిఖిల్ సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.