నాకు సినిమా స్క్రిప్ట్ రాయడమే బద్ధకం.. ఇక పవన్ ప్రసంగాలు నేనెలా రాస్తాను?: త్రివిక్రమ్
- హరికృష్ణ మృతితో షూటింగ్ ఆపాలనుకున్నాం
- కానీ ఎన్టీఆర్ చొరవతో సినిమా పూర్తయింది
- రేపు విడుదల కానున్న అరవింద సమేత
ఇక పవన్ గురించి చెబుతూ.. అన్నయ్య చిరంజీవి, అమ్మ అంజనీదేవికి చెప్పకుండానే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయాడని త్రివిక్రమ్ అన్నారు. ఆ విషయాన్ని తాను కూడా పేపర్లోనే చదివి తెలుసుకున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రసంగాలు తానే రాసిపెడతానన్న వార్తలను త్రివిక్రమ్ ఖండించారు. తనకు సినిమా స్క్రిప్ట్ రాయడానికే బద్ధకమనీ, ఇక తాను రాజకీయ ప్రసంగాలు ఎక్కడ రాయగలనని ప్రశ్నించారు.