'దృశ్యం' దర్శకుడికి ఓకే చెప్పిన కార్తి
- కార్తికి కథ వినిపించిన జీతూ జోసెఫ్
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కార్తి
- నిర్మాతల్లో ఒకరిగా సూర్య
రీసెంట్ గా ఆయన ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసుకుని కార్తికి వినిపించాడట. కార్తికి ఆ కథ నచ్చడంతో, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి సూర్య కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, మిగతా వివరాలను తెలియజేయనున్నారు