సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- '96' రీమేక్ లో కూడా త్రిష?
- చరణ్ సినిమాకి సరికొత్త టైటిల్
- సూపర్ హిట్ రీమేక్ లో రమ్యకృష్ణ
* రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి టైటిల్ కోసం కసరత్తు జరుగుతోంది. మొదట్లో 'స్టేట్ రౌడీ' అని, ఆ తర్వాత 'తమ్ముడు' అనీ కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా 'వినయ విధేయ రామ' అనే క్లాస్ టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
* తెలుగులో ఘన విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని శింబు హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్ లో నదియా నటించిన కీలకమైన పాత్రను తమిళంలో రమ్యకృష్ణ చేయనున్నట్టు తాజా సమాచారం.