అబ్బే, అలాంటిదేం లేదు.. రకుల్ ప్రీత్ తో ఎంగేజ్ మెంట్ పై స్పందించిన హీరో రామ్!
- 'పండగచేస్కో' చిత్రంలో జతకట్టిన రామ్, రకుల్ ప్రీత్ సింగ్
- ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థం జరిగిపోయిందని వార్తలు
- రకుల్ తనకు అంత క్లోజ్ కాదని చెప్పిన రామ్
- ఎవరో అనుకుని పుట్టించిన పుకారేనని స్పష్టీకరణ
ఎక్కడి నుంచి ఈ వార్త వచ్చిందో తెలియలేదని, తాను వాటిని పట్టించుకోబోనని అన్నాడు. తనపై వచ్చే గాసిప్స్ గురించి అన్నయ్య, స్నేహితులు చెబుతూ ఉంటారని అన్నాడు. తనకు ఇంతవరకూ ఏ అమ్మాయీ కనెక్ట్ కాలేదని, తనకు ఎవరైనా నచ్చితే, అర్ధరాత్రి పూట మీడియాకు ఫోన్ చేసి విషయం చెబుతానని అన్నాడు. తనకు స్నేహితులు చాలా తక్కువని, బయటకు పెద్దగా వెళ్లేది లేదని, ఖాళీ దొరికితే కుటుంబ సభ్యుల మధ్యే ఉంటానని కూడా రామ్ చెప్పాడు.