'సైరా' క్లైమాక్స్ లో మార్పు?
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
- విదేశాల్లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ
- వేసవి సెలవుల్లో భారీ విడుదల
ఈ సినిమాలో క్లైమాక్స్ ను మార్చారనేది తాజా సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆంగ్లేయులు బంధించి ఉరితీసి .. ఆయన తలను కోట గుమ్మానికి వెళ్లాడదీశారు. తిరుగుబాటుదారులు భయపడటం కోసం ఆంగ్లేయులు ఆ రోజుల్లో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. అదే క్లైమాక్స్ అయితే అభిమానులు నిరాశ చెందే అవకాశం ఎక్కువగా వుంది. అందువలన ఆ సన్నివేశం చూపించకుండగా, ఉయ్యాలవాడ స్ఫూర్తితో మరికొందరు విప్లవ వీరులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ముగిస్తారట. వేసవి సెలవుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.