పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: బోండా ఉమ ధ్వజం
- చింతమనేని ప్రభాకర్‌పై ఆరోపణలు సరికావు
- రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారనడంపై ఆగ్రహం
- ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి
తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తోందన్న జనసేనాని మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ప్రస్తావిస్తున్నారని.. రాజకీయ నాయకుడన్నాక అలాంటి కేసులు సహజమని ఉమ పేర్కొన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలన్నారు.