చైతూ విషయంలో తెగ ఫీలైపోయిన సమంత... ఫర్వాలేదని చెప్పిన నాగార్జున!
- ఒకే రోజు విడుదలైన సమంత, చైతూల చిత్రాలు
- చైతూ చిత్రానికి మిక్సెడ్ రియాక్షన్, సమంత చిత్రానికి రాలని డబ్బులు
- పరిస్థితి మారుతుందని సర్దిచెప్పిన నాగార్జున
'శైలజారెడ్డి అల్లుడు', 'యూటర్న్' రెండూ విడుదలైన రోజు సమంత బాధపడిందని అన్నారు. 'శైలజారెడ్డి అల్లుడు' రివ్యూలు చూసి, తన వద్దకు వచ్చి, బాధను వ్యక్తపరిస్తే, ఫర్వాలేదని, సాయంత్రానికి అంతా మారిపోతుందని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆపై "మామా నా సినిమాకు రివ్యూలు బాగున్నా, బాక్సాఫీస్ గంట మోగలేదు" అని చెప్పగా, ఆదివారానికి పరిస్థితి మారిపోతుందని సర్దిచెప్పానని, చివరకు అలాగే జరిగిందని అన్నారు.