చంద్రబాబు వారి ట్రాప్ లో పడరాదు... మరో నోటీసు కూడా సిద్ధంగా ఉంది: హీరో శివాజీ
- ఒక మనిషిని నిర్వీర్యం చేయడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
- వారి ట్రాప్ లో చంద్రబాబు పడితే.. ఇబ్బందులు తప్పవు
- మరో నోటీసు గురించి నేను చెప్పలేను
తాను గత మూడు రోజుల నుంచి లాయర్లతో మాట్లాడానని, ఈ నోటీసులకు సంబంధించిన పరిణామాల గురించి తెలుసుకున్నానని శివాజీ చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కోకూడదని చంద్రబాబుకు సూచించారు. మరో నోటీసు కూడా మీ కోసం రెడీగా ఉందని చెప్పారు. ఆ నోటీసు గురించి తాను బయటకు చెప్పలేనని... ఏపీలో తనకు భద్రత ఉందని, కానీ తన సామ్రాజ్యం మరో చోట ఉందని, నోటీసుల గురించి తాను మాట్లాడితే, తనకు అక్కడ భద్రత ఉండదని చెప్పారు.