వైఎస్ జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ?
- షూటింగు దశలో 'యాత్ర'
- ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి
- జగన్ పాత్రపై ప్రత్యేక శ్రద్ధ
తాజాగా ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో ఇప్పుడు యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తోన్న 'నోటా' పట్ల కూడా అంతా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. అందువలన జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది. వై ఎస్ జగన్ పాత్రకి విజయ్ దేవరకొండ కరెక్టుగా సెట్ అవుతాడనే బలమైన నమ్మకం కూడా ఉండటంతో, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.