సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వర్కౌట్స్ మొదలెడుతున్న అనుపమ
- వచ్చే నెలలో త్రిష '96' విడుదల
- రాజమౌళి సినిమాలో చేయడం లేదంటున్న సమంత
* త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని వచ్చే నెల 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి నిర్ణయించారు. తెలుగులో ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించే భారీ చిత్రంలో సమంత ఓ కథానాయికగా నటించనుందంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను సమంత తాజాగా ఖండించింది. ఈ చిత్రంలో తాను నటించడం లేదని, ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది.