ఎన్టీఆర్ ను చూస్తే.. మళ్లీ పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టు అనిపించింది!: తమన్
- 'అరవింద సమేత' షూటింగ్ లో బిజీ అయిన తారక్
- నిన్న ఓ సాంగ్ చిత్రీకరణ
- తారక్ మళ్లీ పాత ఎనర్జీని తెచ్చుకున్నాడన్న తమన్
'చాలా ఎమోషనల్ గా తారక్ అన్న ఓ సాంగ్ కోసం షూటింగ్ స్టార్ట్ చేశారు. తన డ్యాన్స్ తో మళ్లీ తన పాత ఎనర్జీని తెచ్చుకున్నట్టుగా అనిపించింది. తారక్ అన్నను మళ్లీ ఈ విధంగా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. 'అరవింద సమేత' టీమ్ తరపున తారక్ కు లాట్స్ ఆఫ్ లవ్. ఆడియో అప్ డేట్స్ కూడా ఈ వారంలో స్టార్ట్ అవుతాయి' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.