సోదరి వైద్యం కోసం సాయం కోరిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్!
- తన సోదరి నరాల సమస్యతో బాధపడుతోందన్న సుశాంత్
- స్టెరాయిడ్స్ చికిత్స మాత్రమే సరిపోవడం లేదని వెల్లడి
- సాయం చేసే వారికి సందేశం చేర్చాలని వినతి
ఈమేరకు ట్వీట్ చేస్తూ, ‘‘నా సోదరి సీఐడీపీ (నరాల బలహీనత)తో బాధపడుతోంది. దీనికి స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. అయితే, అది సరిపోవట్లేదు. వేరే ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి రీ ట్వీట్‌తో మాకు సాయం చేసేవారికి ఈ సందేశం చేర్చండి’’ అంటూ సుశాంత్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తమకు తెలిసిన వైద్యుల వివరాలను కామెంట్ రూపంలో పేర్కొన్నారు. సాయం చేసిన వారందరికీ సుశాంత్ థాంక్స్ చెప్పాడు.