నిందితుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను గదిలోపెట్టి తాళం వేసిన గ్రామస్థులు!
- రూ.7 లక్షలు పోయాయంటూ వ్యాపారి ఫిర్యాదు
- అనుమానితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు
- అడ్డుకుని గొడవకు దిగిన స్థానికులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంజూర్ను అరెస్ట్ చేసేందుకు కుచిల్ గ్రామానికి వచ్చారు. గమనించిన స్థానికులు నలుగురు పోలీసులనూ అడ్డుకున్నారు. బాధిత వ్యాపారి ఆరోపిస్తున్నట్టు ఆ చోరీతో మంజూర్ కు సంబంధం లేదని, అతడు అమాయకుడని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో గ్రామస్థులందరూ కలిసి పోలీసులను నిర్బంధించి ఓ గదిలో పెట్టి తాళం వేశారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఫోన్లతో విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారొచ్చి వీరిని విడిపించారు. పోలీసులను నిర్బంధించినందుకు గాను 70 మందిపై కేసులు నమోదు చేశారు.