ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి నేనే తప్పుకుంటా: రకుల్ ప్రీత్ సింగ్
- జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు
- ఈ రోజు ఉన్న ఫేమ్ రేపు ఉండకపోవచ్చు
- పరుగు ఎప్పుడు ఆపాలో నాకు తెలుసు
దీనిపై ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పింది. ఈ రోజు ఉన్న ఫేమ్, రేపు ఉండకపోవచ్చని తెలిపింది. వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవని చెప్పింది. తనకు పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని... ప్రేక్షకులకు తాను బోర్ కొడుతున్నానని అనిపించినప్పుడు తనంతట తానే ఇండస్ట్రీకి దూరమవుతానని తెలిపింది.