'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో మేఘా ఆకాశ్
- నిరాశపరిచిన 'లై' .. 'ఛల్ మోహన్ రంగ'
- తెలుగులో రాని అవకాశాలు
- తమిళ సినిమాలపై దృష్టి
లుక్ పరంగా కుర్రకారు నుంచి మంచి మార్కులు పడినప్పటికీ, సక్సెస్ లేని కారణంగా వెనుకబడిపోయింది. దాంతో ఆమె తమిళంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో అధర్వ జోడీగా 'బూమరాంగ్' చేస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో తమిళ సినిమాను అంగీకరించింది. ఇది 'అత్తారింటికి దారేది' సినిమాకి రీమేక్. ఒక కథానాయికగా ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.