వైఎస్ వర్ధంతి సందర్భంగా 'యాత్ర' నుంచి లిరికల్ వీడియో
- మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
- 90 శాతం చిత్రీకరణ పూర్తి
- సంక్రాంతికి భారీ విడుదల
వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి .. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఎమోషనల్ గా సాగే ఈ లిరికల్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.