అమ్మతో కలిసి పనిచేయాలనుంది .. అందుకే ఈ నిర్ణయం: శ్రుతి హాసన్
- అమ్మానాన్నల వారసురాలిగా వచ్చాను
- నాపై అంచనాలు వుండాలనుకోను
- నాకు నచ్చినట్టుగా చేసుకువెళుతుంటాను
"మా అమ్మా నాన్నలు చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వాళ్ల వారసురాలిగా నేను ఈ రంగంలోకి వచ్చాను. వాళ్లు గర్వపడేలా నా కెరియర్ ను మలచుకునే పనిలోనే వున్నాను. ఈ విషయంలో నాపై అంచనాలు వుండాలని నేను అనుకోను .. నాకు తోచినట్టుగా నేను అందుకు సంబంధించిన పనులను చేసుకుంటూ వెళుతుంటాను.
ఇంతవరకూ నేను మా నాన్నకి సంబంధించిన సినిమాలకి పనిచేశాను .. ఆయనతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఇక అమ్మతోనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందుకే తనతో కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిజంగా ఇది నాకెంతో ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చింది.