అనుష్క కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు
- మాధవన్ తో హేమంత్ మధుకర్ మూవీ
- విభిన్నమైన కథాకథనాలు
- ఈ ఏడాది చివరిలో విడుదల
తాజాగా అనుష్క ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మాధవన్ ను ఎంపిక చేసుకున్న ఆయన, తాజాగా అనుష్కను తీసుకున్నాడని అంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.