సుమంత్ సినిమా టీజర్ ను విడుదల చేయనున్న వైఎస్ జగన్
- విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'ఇదం జగత్'
- నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుమంత్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
ఈ చిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహించగా... జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.