త్రివిక్రమ్ కోసమే వెయిట్ చేస్తోన్న అల్లు అర్జున్
- బన్నీకి కథ వినిపించిన విక్రమ్ కుమార్
- మార్పులు చేర్పులు చెప్పిన బన్నీ
- చివరి నిమిషంలో ప్రాజెక్టు పక్కకి
అల్లు అర్జున్ కి ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడవలసిన అవసరం వుంది. అందువలన విక్రమ్ కుమార్ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టేసి .. త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడట. 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా తరువాత త్రివిక్రమ్ వేరే ప్రాజెక్టును కమిట్ కాలేదు. అందువలన ఆయనతో చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడని అంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే.