రేణు దేశాయ్ డైరెక్షన్.. రైతు సమస్యలే ప్రధానంగా సినిమా!
- రైతుల జీవితాలే ప్రధాన కథాంశం
- వాళ్ల సమస్యలకి పరిష్కారాలు
- వచ్చే ఏడాది సెట్స్ పైకి
రేణు దేశాయ్ రూపొందిస్తోన్న సినిమా రైతు సమస్యల నేపథ్యంలో కొనసాగుతుందట .. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. "రైతుల జీవితాలు .. సమస్యలు .. వాళ్ల ఆత్మహత్యలపై ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో రైతుల సమస్యలను చూపించడమే కాదు, వాటికి పరిష్కారాలు చూపడం కూడా జరుగుతుంది. ముందుగా రైతుల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించాలని అనుకుంటున్నాను. ఈ విషయంపై బాగా అధ్యయనం చేసి .. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగును మొదలుపెడతామని చెప్పుకొచ్చారు.