'శైలజా రెడ్డి అల్లుడు' నుంచి ఫస్టు వీడియో సాంగ్
- చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్
- పవర్ఫుల్ అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ
- ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు
గోపీసుందర్ చేసిన ట్యూన్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటకి చైతూ వేసిన స్టెప్స్ కూడా కొత్తగా .. యూత్ ను ఉత్సాహపరిచేలా వున్నాయి. పాటలో నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనూ మరింత గ్లామరస్ గా అలరిస్తోంది. ఈ సినిమాలో చైతూ అత్తగారిగా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.