'గూఢచారి'లో నాగ్ మేనకోడలు దుమ్మురేపేసిందట!
- హీరోయిన్ గా ఒక సినిమా చేసిన సుప్రియ
- చాలా కాలం తరువాత రీ ఎంట్రీ
- నటనపరంగా మంచి మార్కులు
ఈ సినిమాలో ఆమె గెస్టుగానే కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె పవర్ఫుల్ పాత్రలో సినిమా అంతా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంత గ్యాప్ తీసుకున్నా ఆమె చాలా సహజంగా .. అద్భుతంగా నటించిందని అంటున్నారు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి దుమ్మురేపేసిందని చెబుతున్నారు. ఇకపై నటిగా కొనసాగాలని ఆమె అనుకుంటే మాత్రం .. బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.