నా సినిమాను పైరసీలో చూసినా సంతోషమే.. ముల్క్ దర్శకుడు అనుభవ్ సిన్హా!
- పైరసీలోచూడాలని పాక్ ప్రజలకు సూచన
- అక్కడ సినిమాపై నిషేధం నేపథ్యంలో విజ్ఞప్తి
- తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ముల్క్
ఎందుకంటే ముల్క్ చిత్రంపై పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. దీంతో నా ప్రియమైన పాక్ ప్రజలకు.. అంటూ అనుభవ్ సిన్హా ఓ లేఖను విడుదల చేశారు. అందులో.. ‘నేను తీసిన ముల్క్ అనే సినిమాపై మీ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. మీరంతా చట్టబద్ధంగా ఈ సినిమాను చూడాలని నాకూ ఉంది. కానీ ఒకవేళ కుదరకుంటే పైరసీలో అయినా చూడండి. సినిమా చూశాక పాక్ సెన్సార్ బోర్డు ఎందుకు మా చిత్రాన్ని నిషేధించిందో చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు చూడకూడదనే పాక్ సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది’ అని లేఖలో సిన్హా పేర్కొన్నారు.
రిషీ కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రాణాలు ప్రధాన పాత్రల్లో నటించిన ముల్క్ ఈ రోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఉగ్రవాద అభియోగాలు ఎదుర్కొంటున్న కుటుంబ పెద్దగా రిషీ కపూర్, ఆయన తరఫున వాదించే లాయర్ గా తాప్సీ నటించారు. బనారస్ మీడియా వర్క్స్, సోహమ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.