'గీత గోవిందం' బన్నీ చేయవలసిందట!
- గీతా ఆర్ట్స్ 2 లో 'గీత గోవిందం'
- హీరోయిన్ ఎంపిక విషయంలో జాప్యం
- ఆగస్టు 15వ తేదీన విడుదల
అల్లు అర్జున్ కి ఈ కథ ఎంతగానో నచ్చిందనీ, అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా చేయలేకపోయాడని అన్నాడు. ఇక ఈ కథకి ఫలానా కథానాయికలైతే బాగుంటుందని భావించిన అల్లు అర్జున్ .. అవకాశం వస్తే ఈ ప్రాజెక్టును వదులుకోవద్దని వాళ్లకి చెప్పాడట. అయినా ఆ కథానాయికలెవరూ ఈ సినిమా చేయడానికి ఆసక్తిని చూపించలేదని అన్నాడు. హీరోయిన్ ఎంపిక విషయంలో మూడు నెలలు వెయిట్ చేయవలసి వచ్చిందని చెప్పాడు. దాంతో ఈ కథ ఏ హీరోయిన్స్ దగ్గరికి వెళ్లింది? వాళ్లు ఎందుకని ఉత్సాహాన్ని చూపించలేదనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.