యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన పోలీస్ ఆఫీసర్.. వైరల్ గా మారిన ఫొటోలు!
- యోగి ఆశీర్వాదం తీసుకున్న గోరఖ్ పూర్ సర్కిల్ అధికారి ప్రవీణ్
- ఆన్ లైన్ లో వైరల్ గా మారిన ఫొటోలు
- పోలీస్ అధికారి వైఖరిపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన
ఓ పోలీస్ అధికారి యూనిఫామ్ లో రాజకీయ నేత యోగి ముందు మోకరిల్లడంపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పోలీస్ అధికారై ఉండి ఇలా నేతల ముందు మోకరిల్లవచ్చా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మిగతా మతాలకు చెందిన పోలీస్ అధికారులు కూడా యూనిఫామ్ లోనే మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఇంకొందరు సింగ్ కు మద్దతుగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ శక్తిమంతమైన గోరఖ్ పూర్ మఠానికి అధిపతి అనీ, చాలా మంది ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.