'దటీజ్ మహాలక్ష్మి'గా తమన్నా వచ్చేది అప్పుడే!
- హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
- కన్నడలో 'బట్టర్ ఫ్లై'
- తమిళంలో 'పారిస్ పారిస్'
ఇక తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్ని రోజులుగా యూరప్ లో జరుపుతూ వచ్చిన చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయింది. అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, అక్టోబర్లో విడుదల చేయనున్నారు. తెలుగులోనూ ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.